హీరో రోహిత్ వర్మ, హీరోయిన్ రియా సుమన్తో జోడీగా కొత్త ప్రాజెక్ట్ మొదలు
3 months ago | 5 Views
రోహిత్ వర్మ కథానాయకుడిగా రియా సుమన్ నాయికగా నటిస్తోన్న నూతన చిత్రం మంగళవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. క్రేజీ కింగ్స్ స్టూడియోస్ ఎల్.ఎల్.పి. బేనర్ లో నజీర్ జమాల్ నిర్మిస్తుండగా, గోవిందరెడ్డి చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. హీరో హీరోయిన్లపై తీసిన ముహూర్తపు సన్నివేశానికి విజయ్ కనకమేడల క్లాప్ కొట్టగా, సీనియర్ దర్శకుడు రామ్ ప్రసాద్ కెమెరా స్విచాన్ చేశారు. మరో దర్శకుడు మల్లిఖార్జున గౌరవ దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ కనకాల, ప్రగతి, వర్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం చిత్రం గురించి నిర్మాత నజీర్ జమాల్ మాట్లాడుతూ.. తెలుగులో నాకిది మొదటి సినిమా. కథ విన్న తర్వాత బాగా నచ్చి సినిమా చేయడానికి ముందుకు వచ్చాను.
రోహిత్ హీరోగా నటిస్తున్నాడు. ఇందులో పాటలు అద్భుతంగా వుంటాయి. దర్శకుడు కథకు అనుగుణంగా నటీనటుల ఎంపిక చేయడం జరిగింది. కథానాయకుడు రోహిత్ వర్మ మాట్లాడుతూ.. దర్శకుడు అద్భుతమైన కథ చెప్పారు. ఈ సినిమాతో తెలుగులోకి రావడం చాలా ఆనందంగా వుంది. సినిమాకి సీనియర్ సాంకేతిక సిబ్బంది పనిచేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు మంచి సినిమా ఇవ్వాలని నా మనసులో కోరిక వుండేది. ఈ చిత్రంలో అది కుదిరింది. చిత్రం కోసం తెలుగు బాగా నేర్చుకుంటున్నాను. అందరూ మెచ్చే సినిమా అవుతుందని నమ్మకం ఉంది. హీరోయిన్ రియా సుమన్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో పనిచేయడం ఆనందంగా వుంది. మంచి పాత్రను పోషిస్తున్నాను. ఇందుకు దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సినిమాకు మంచి టైటిల్ పెట్టబోతున్నారు. వినాయకచవితికి తెలియజేయనున్నారు. తొలుత మోంటేజ్ సాంగ్ లో రేపటినుంచి షూటింగ్ ప్రారంభిస్తున్నాం. చక్కటి సాహిత్య, సంగీతం ఈ కథకు బాగా కుదిరింది. నటుడు నిఖిల్ దేవేదుల మాట్లాడుతూ.. ఈ రోజు మంచి ముహూర్తంతో ప్రారంభించినందుకు ఆనందంగా వుంది. చక్కటి పాత్రను పోషిస్తున్నాను. అందరూ ఆశీస్సులు కావాలి. నటి అక్షర మాట్లాడుతూ.. సినిమాలో భాగమైనందుకు ఆనదంగా వుంది. అందరూ చూడతగ్గ సినిమా ఇది. దర్శకుడు గోవిందరెడ్డి చంద్ర మాట్లాడుతూ.. క్రేజీ కింగ్ ప్రొడక్షన్ లో క్రేజీ కథతో రాబోతున్నాం. ఛోటాకె. ప్రసాద్, మణిశర్మ వంటి సీనియర్స్ ఈ సినిమాకు పనిచేస్తున్నారు. కథ అందరికీ కనెక్ట్ అయ్యేవిధంగా వుంటుంది. రోహిత్ హిందీలో చేశాడు. తెలుగులో మొదటి సినిమా. రియా కథ నచ్చి బాగా సపోర్ట్ చేసింది. ఇది పక్కా కమర్షియల్ సినిమా అవుతుందనే నమ్మకముంది. పూర్తి వివరాలు వినాయకచవితికి తెలియజేస్తాం.
తారాగణం: రోహిత్ వర్మ, రియా సుమన్, నిఖిల్ దేవేదుల, అక్షర, హరీష్ ఉత్తమన్, నవీన్ నేని తదితరులు
బేనర్: క్రేజీ కింగ్స్ స్టూడియోస్ ఎల్.ఎల్.పి.,
నిర్మాత: నజీర్ జమాల్
దర్శకత్వం: గోవిందరెడ్డి చంద్ర
సినిమాటోగ్రఫీ: సురేష్ రఘుతు
సంగీతం: మణిశర్మ
ఎడిటర్ : ఛోటా కె.ప్రసాద్
ఆర్ట్ : విష్ణు వర్దన్
ఫైట్ మాస్టర్ : నటరాజ్
సంభాషణలు : రాకేంద్ మౌళి
పాటలు: చైతన్య ప్రసాద్, శ్రీహర్ష ఈమని
పి.ఆర్.ఓ. వంశీ-శేఖర్
ఇంకా చదవండి: అనుష్క శెట్టి 'ఘాటి' సెకండ్ సింగిల్ దస్సోరా విడుదల
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# రోహిత్ వర్మ # రియా సుమన్




