డార్క్ కామెడీ కథతో 'గుర్రం పాపిరెడ్డి'
5 days ago | 5 Views
నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా 'గుర్రం పాపిరెడ్డి'. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న 'గుర్రం పాపిరెడ్డి' సినిమా ఈ నెల 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.
'గుర్రం పాపిరెడ్డి' సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ వీడియోను మేకర్స్ ఫన్నీగా రూపొందించారు. ఈ వీడియోలో యాక్టర్స్ ఫరియా అబ్దుల్లా, రాజ్ కుమార్ కాసిరెడ్డి, వంశీధర్ కోసిగి మూవీ ప్రమోషన్ కోసం హిలేరియస్ కంటెంట్ చేయడం, హీరో నరేష్ అగస్త్య వచ్చి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం చూపించారు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ప్రభాస్, మహేశ్ బాబును గెస్ట్ లుగా తీసుకొచ్చేందుకు వీళ్లంతా ప్రయత్నాలు చేయడం సరదాగా ఉండి నవ్విస్తోంది.
ఇంకా చదవండి: కార్తితో క్రేజీ కాన్స్ "అన్నగారు వస్తారు" లిరికల్ సాంగ్ రిలీజ్
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# నరేష్ అగస్త్య # ఫరియా అబ్దుల్లా # గుర్రం పాపిరెడ్డి




