హారర్ థ్రిల్లర్ లవర్స్ కి గుడ్ న్యూస్! తెలుగు జీ5లో నవంబర్ 7 నుంచి 'జరణ్' స్ట్రీమింగ్...
26 days ago | 5 Views
చక్కటి వినోదానికి మాత్రమే కాదు, స్పైన్ చిల్లింగ్ థ్రిల్లర్స్ కి కేరాఫ్ గా మారింది తెలుగు జీ5. ఇటీవల కిష్కిందర్ లాంటి సక్సెస్‌ఫుల్ థ్రిల్లర్ అండ్ హారర్‌తో ఆకట్టుకున్న తెలుగు జీ5 ఇప్పుడు సరికొత్త థ్రిల్లర్ అండ్ హారర్ కంటెంట్‌తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమైంది. గ్రిప్పింగ్ థ్రిల్లర్ అండ్ హారర్ కంటెంట్‌కి కేరాఫ్ గా పేరు తెచ్చుకున్న 'జరణ్'ని తెలుగులో అందిస్తోంది. తెలుగు జీ5లో నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది 'జరణ్'. హృషికేష్ గుప్త రాసి, దర్శకత్వం వహించిన హారర్ థ్రిల్లర్ 'జరణ్'. అనీజ్ బాజ్మి ప్రొడక్షన్స్, ఎ అండ్ ఎన్ సినిమాస్ ఎల్ ఎల్పీ, ఏ3 ఈవెంట్స్ అండ్ మీడియా సర్వీసెస్ నిర్మించాయి. అమృతా శుభాష్, అనితా డేట్ కెల్కర్, కిశోర్ ఖడమ్, జ్యోతి మల్షే, అయానీ జోష్ కీలక పాత్రల్లో నటించిన థ్రిల్లర్ అండ్ హారర్ 'జరణ్'. రాధ (అమృత శుభాష్), తన కుమార్తె సయీ (అవనీ జోషి)తో కలిసి తన పూర్వీకుల ఇంటికి వెళ్తుంది. ఓ పాత బొమ్మ దొరికిన తర్వాత తనకు ఎదురైన వింత అనుభవాలను నెమరేసుకోవాలనుకుంటుంది.
ఆమె అక్కడికి వెళ్లిన తర్వాత ఏమైంది? అనే సంఘటనలను వెన్నులో వణుకు పుట్టించే మిస్టరీతో తెరకెక్కించారు డైరక్టర్. ఆమెలో నిగూఢంగా దాగి ఉన్న భయాలన్నీ ఒక్కసారిగా పురివిప్పడం, ఆమె ప్రవర్తనలో వింత మార్పు కనిపించడం, వాస్తవానికి, ఇల్యూజన్‌కి మధ్య ఉన్న గీత చెరిగిపోవడం, అప్పటి నుంచి ట్రామా, మెమరీ, సూపర్‌నేచురల్ ఇంటర్వైన్ కలగలిపి కనిపించే సన్నివేశాలు... ప్రేక్షకులకు ప్రతి క్షణం థ్రిల్ ని పంచుతాయి. వెన్నంటే పరిస్థితులు, అత్యద్భుతమైన పెర్ఫార్మెన్సులు, భావోద్వేగాలను పంచే కథ, కథనం 'జరణ్'.ని ఇంకో రేంజ్‌కి తీసుకెళ్లింది. మానసిక ప్రవృత్తికి అద్దం పడుతుంది 'జరణ్'. ప్రతి విషయానికీ మనసులో ఎలాంటి భయాందోళనలు, భావోద్వేగాలు మిళితమై నీడలా మెలుగుతాయో చెబుతుంది. తెలుగు ZEE5 లో నవంబర్ 7 నుంచి "జరణ్" స్ట్రీమింగ్ అవుతుంది.
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# జరణ్ # జీ5




