రజనీకాంత్ ‘కూలి’ సెప్టెంబర్ 11 నుంచి ప్రైమ్ వీడియోలో గ్లోబల్ ప్రీమియర్
3 months ago | 5 Views
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన ఉత్సాహభరితమైన యాక్షన్ థ్రిల్లర్ కూలి చిత్రము యొక్క ప్రత్యేక ప్రపంచవ్యాప్త ప్రసారాన్ని ప్రకటించింది. లోకేష్ కనగరాజ్ రచించి, దర్శకత్వం వహించిన మరియు అనిరుద్ధ్ స్వరరచన చేసిన ఈ చిత్రములో నాగార్జున, సౌబిన్, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్, ఆమీర్ ఖాన్, రచిత రామ్, మరియు పూజ హెగ్డే వంటి అగ్ర తారాగణం ముఖ్యపాత్రలలో నటించారు. కూలి సెప్టెంబరు 11 నుండి తమిళములో, భారతదేశము మరియు ప్రపంచవ్యాప్తంగా 240 దేశాలు మరియు భూభాగాలలో ప్రైమ్ వీడియో పై ప్రత్యేకంగా ప్రసారం అవుతుంది, ఇది తెలుగు, మళయాళం మరియు కన్నడ భాషలలోకి డబ్ చేయబడింది.
విశాఖపట్నం రేవుల నేపథ్యములో సెట్ చేయబడిన కూలి చిత్ర కథ, రెబెల్ గా మారిన దేవ అనే ఒక మాజీ కూలి తన ప్రాణ స్నేహితుడి అనుమానాస్పద మరణము గురించి దర్యాప్తు చేస్తుండగా ఒక స్మగ్లింగ్ సిండికేట్ ను కనుగొనడము గురించి సాగుతుంది. రహస్య ఎలెక్ట్రిక్ కుర్చీ, భూస్థాపితం చేయబడిన నిజాలు మరియు దాగి ఉన్న ఒక ద్రోహిని కనుక్కోవడం వలన అతను ద్రోహము మరియు అసంపూర్ణ వ్యాపారాల ఒక ప్రమాదకరమైన ఆటలోకి లాగబడతాడు. న్యాయము కోసం పోరాటం తన గతానికి సంబంధించిన జ్ఞాపకాలతో ఢీకొట్టగా, దేవా ప్రయాణము న్యాయము, నిజాయితీ, మనుగడ మరియు తిరిగుబాటుల కొరకు కనికరంలేని యుద్ధముగా మారుతుంది. యాక్షన్, సస్పెన్స్, భావోద్వేగాలు మరియు రజనీకాంత్ నటనల సమ్మేళనముతో, కూలీ ఆయన 50-సంవత్సరపు సినిమా వారసత్వపు వేడుక మరియు కొత్తతరం వ్యాన్స్ కొరకు ఒక ఆకర్షణీయమైన దృశ్యం.
ఇంకా చదవండి: శ్రద్ధా శ్రీనాథ్ , రాజేష్ ఎం. సెల్వా గ్రిప్పింగ్ థ్రిల్లర్ ‘ది గేమ్: యు నెవర్ ప్లే అలోన్’ అక్టోబర్ 2న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!




