కిరణ్ అబ్బవరం నుంచి ఫెస్టివ్ ట్రీట్ – K-ర్యాంప్
2 months ago | 5 Views
సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం " K-ర్యాంప్" సినిమా నుంచి 'ఓనమ్' పండుగ శుభాకాంక్షలతో స్పెషల్ పోస్టర్ విడుదల, దీపావళి సందర్భంగా అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ
సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా " K-ర్యాంప్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. " K-ర్యాంప్" సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.
ఈ రోజు 'ఓనమ్' పండుగ సందర్భంగా " K-ర్యాంప్" సినిమా నుంచి విశెస్ చెబుతూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. కేరళ నేపథ్యంగా జరిగే కథను " K-ర్యాంప్" మూవీలో సరికొత్తగా చూపించబోతున్నారు. ఓనమ్ పండుగ సెలబ్రేషన్స్ తో సాగే పాటను కూడా ఈ మూవీలో ప్రత్యేకంగా చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ సక్సెస్ ఫుల్ గా జరుగుతున్నాయి. ఈ నెల 9న " K-ర్యాంప్" సినిమా నుంచి మ్యాజికల్ లవ్ మెలొడీ సాంగ్ 'కలలే కలలే' విడుదల చేయబోతున్నారు.
నటీనటులు - కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా, నరేష్,సాయి కుమార్,వెన్నెల కిషోర్ తదితరులు
టెక్నికల్ టీమ్
ప్రొడక్షన్ డిజైనర్ - బ్రహ్మ కడలి
యాక్షన్ - పృథ్వీ
ఎడిటర్ - ఛోటా కె ప్రసాద్
డీవోపీ - సతీష్ రెడ్డి మాసం
మ్యూజిక్ - చేతన్ భరద్వాజ్
పీఆర్ ఓ- జీఎస్ కే మీడియా(సురేష్ - శ్రీనివాస్), వంశీ శేఖర్
కో-ప్రొడ్యూసర్-బాలాజీ గుట్ట
ప్రొడ్యూసర్ - రాజేష్ దండా-శివ బొమ్మకు
రచన, దర్శకత్వం - జైన్స్ నాని
ఇంకా చదవండి: డిస్నీ నుండి కొత్త పోస్టర్, ట్రైలర్ విడుదల – ‘ట్రాన్: ఏరీస్’ అక్టోబర్ 10న థియేటర్స్‌లో!
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# కిరణ్ అబ్బవరం # K-ర్యాంప్




