ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ అంటూనే ఆసక్తి పెంచిన "స:కుటుంబానాం" టీజర్.
5 months ago | 5 Views
ఈ మధ్యకాలంలో కంటెంట్ ఉన్న సినిమాలు ఏ రేంజ్ లో ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా కూడా అలాంటి కోవలోకే వెళ్తుంది అని చెప్పచ్చు. ఫ్యామిలీ మ్యాన్ అనిపించుకుంటున్న కథానాయకుడు ఫ్యామిలీనీ హేట్ చేస్తూ కనిపించిన ఈ టీజర్ తో కథ తాలూకు కొత్తదనం చెప్పకనే చెప్పారు దర్శక రచయిత ఉదయ్ శర్మ. మణిశర్మ సంగీతం అందించిన ఈ సరికొత్త కుటుంబ కథా చిత్రంలో రాజేంద్రప్రసాద్, రామ్ కిరణ్, మేఘా ఆకాష్, బ్రహ్మానందం, సత్య, గిరి, భద్రం ముఖ్య తారాగణంగా.. ప్రేక్షకులని అలరించబోతున్నారు.
ఈ చిత్ర టీజర్ విషయానికి వస్తే ఒక పక్క నుండి అర్జున్ రెడ్డి లాంటి వైబ్స్ కనిపిస్తూనే మరోపక్క కుటుంబ సమేతంగా చూసే చిత్రం అని అర్థమవుతుంది. టీజర్ లోని ప్రతి డైలాగ్, విజువల్ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. అలాగే సత్య, బ్రహ్మానందం గారి హాస్యం చిత్రంలో బాగా పండుతుందని అనిపిస్తుంది. మేఘా ఆకాష్ మంచి క్యారెక్టర్ ప్లే చేసినట్లు అర్థమవుతుంది. రామ్ కిరణ్ ఈ చిత్రం ద్వారా ఇండస్ట్రీలో ఒక మార్క్ సృష్టిస్తారు నడిపించేలా తన ప్రెసెన్స్ & పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. కుటుంబం విషయాలలో హీరో ఉద్దేశం అందరిలా సహజంగా ప్రేమగా కాకుండా కాస్త కొత్తగా ఉంటుందని ఈ చిత్ర టీజర్ అనిపిస్తుంది. టీజర్ లోని సంగీతం చాలా బాగుంది.
త్వరలోనే విడుదల అవనున్న ఈ చిత్రం ప్రేక్షకులకు చక్కటి తెలుగింటి భోజనం అందించనుంది.
తారాగణం: రామ్ కిరణ్, మేఘా ఆకాష్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, సత్య, శుభలేఖ సుధాకర్, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, గిరిధర్, తాగుబోతు రమేష్, బద్రం .. తదితరులు
సాంకేతిక బృందం:
రచన & దర్శకత్వం: ఉదయ్ శర్మ
నిర్మాత: హెచ్ మహదేవ గౌడ్
సంగీతం: మణి శర్మ
DOP: మధు దాసరి
ఎడిటర్: శశాంక్ మలి
కొరియోగ్రాఫర్: చిన్ని ప్రకాష్, భాను, విజయ్ పొలాకి
సాహిత్యం: అనంత శ్రీరామ్
ఆర్ట్ డైరెక్టర్: P.S. వర్మ
ఫైట్స్: అంజి, కార్తీక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రోహిత్ కుమార్ పద్మనాభ.
పి ఆర్ ఓ: మధు వి ఆర్
డిజిటల్ : డిజిటల్ దుకాణం
ఇంకా చదవండి: నవీన్ చంద్ర నటించిన 'షోటైం' మూవీ ప్రపంచవ్యాప్తంగా జూలై 4న గ్రాండ్ రిలీజ్
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!




