ప్రముఖ ఓటీటీ సంస్థ ZEE5 నుంచి దీపావళి పండుగ సందర్భంగా అద్భుతమైన ఆఫర్.. తక్కువ ధరకే సబ్‌స్క్రిప్షన్స్

ప్రముఖ ఓటీటీ సంస్థ ZEE5 నుంచి దీపావళి పండుగ సందర్భంగా అద్భుతమైన ఆఫర్.. తక్కువ ధరకే సబ్‌స్క్రిప్షన్స్

1 month ago | 5 Views

దీపావళి పండుగను మరింత సందడిగా మార్చేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థ ZEE5 అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది. ఈ మేరకు పండుగ స్పెషల్ ఆఫర్‌ను వినియోగదారులకు అందించింది. ఇండియాలోని సినీ లవర్స్‌కి ఈ పండుగను మరింత ప్రత్యేకంగా మార్చేందుకు ZEE5 తన సబ్ స్క్రిప్షన్స్ ప్లాన్స్‌లో మార్పులు, చేర్పుల్ని చేసింది. దీపావళి సందర్భంగా వన్ వీక్ ప్లాన్ (అక్టోబర్ 13 నుంచి 20 వరకు) అంటూ ప్రత్యేకమైన ఓ ఆఫర్‌ను ఇచ్చింది. హిందీ కంటెంట్‌ను చూడాలని అనుకునేవారు కేవలం రూ. 149 చెల్లించాలి. మామూలుగా అయితే ఈ ప్యాక్ రూ. 199గా ఉంటుంది. పండుగ సందర్భంగా కేవలం రూ. 149కే ఇప్పుడు వస్తుంది. ఇక ప్రాంతీయ భాషల్లో అయితే ఈ ప్యాక్ రూ. 99 గా ఉండగా.. ఇప్పుడు దీపావళి సందర్భంగా కేవలం రూ. 59కే రానుంది. ఇక అన్ని రకాల యాక్సెస్ కోసం అయితే రూ. 299 ఉండగా.. ఈ దీపావళి స్పెషల్‌గా రూ. 249 కే రానుంది.

ఈ సబ్ స్క్రిప్షన్స్ టైంలో పండును మరింత స్పెషల్‌గా మార్చేందుకు క్యాష్ బ్యాక్ ఆఫర్లను కూడా ప్రకటించింది. పేటీఎం యూపీఐ ఆటో పే, క్రెడ్ యూపీఐ ఆటో పే వంటి వాటిపై క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా రానున్నాయి. అంతే కాకుండా ఈ ప్లాన్స్‌తో పాటుగా జియో సావన్‌ ప్రోను మూడు నెలలు ఉచితంగానూ వినియోగించుకోవచ్చు. దీంతో దీపావళి మరింత స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంది.

ఈ దీపావళి సందర్భంగా ఎన్నెన్నో కొత్త కథలు, వెబ్ సిరీస్‌లు, సినిమాల్ని ZEE5 అందిస్తోంది. హిందీ నుంచి భగవత్ చాప్టర్ వన్ - రాక్షస్, సాలీ మోహబ్బత్, హనీమూన్ సే హత్య వంటి సిరీస్‌లు రాబోతోన్నాయి. మరాఠీ నుంచి స్థల్, అత తంబ్యాచ్ నాయ్, జరణ్ వంటి కథతలు రానున్నాయి. బెంగాలీ నుంచి శ్రీమతి దాస్ గుప్తా, మ్రిగయ ది హంట్, అబర్ ప్రోలోయ్ వంటి సిరీస్‌లు వస్తున్నాయి. తెలుగు నుంచి కిష్కింధపురి, డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు, జయమ్ము నిశ్చయమ్మురా వంటివి రానున్నాయి. తమిళం నుంచి వేదువన్, హౌస్ మేట్స్, మామన్ వంటి సినిమాలు ఉన్నాయి. మలయాళం నుంచి సుమతి వలువు, అభంతర కుట్టవాలి, కమ్మట్టం వంటివి సిద్దంగా ఉన్నాయి. ఇక కన్నడ నుంచి ఏలుమలే, అయ్యన మనే, మరిగల్లు వంటి కథలు అలరిస్తాయి. ఈమేరకు 


ZEE5 చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సిజు ప్రభాకరన్ మాట్లాడుతూ .. ‘ప్రతి దీపావళి సంప్రదాయాలు, వేడుకలు, అందమైన క్షణాల కథను చెబుతుంది. ZEE5లో మేము ప్రతి భాషలో, ప్రతి సినిమాతో ఆశ్చర్యం, ఆనందాన్ని కలిగించే విధంగా ఆ కథలకు ప్రాణం పోస్తాము. ఈ పండుగ సందర్భంగా స్థానికంగా ప్రతి భాషలో ప్రతిధ్వనించే కంటెంట్‌ను అందించాలని అనుకున్నాం. అందుకే రకరకాల కథల్ని యాక్సెసిబిలిటీని పెంచేలా పండుగ ఆఫర్‌లతో అందిస్తున్నాం. ఈ దీపావళిలో, ప్రేక్షకులు కొత్త కథలను చూడాలని, వాటితో నిజంగా కనెక్ట్ అవ్వాలని, ఈ పండుగ సీజన్‌ను ఆనందంగా జరుపుకోవాలని మేం ఆశిస్తున్నాము’ అని అన్నారు.

జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ కార్తీక్ మహాదేవ్ మాట్లాడుతూ .. ‘దీపావళి పండుగ భారతదేశం ఆచారానికి, సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ క్రమంలో మేం సినీ ప్రేమికుల కోసం కొత్త కథల్ని చెప్పాలన్న ఉద్దేశంతో ఇలా పండుగ ఆఫర్‌లను ప్రకటించాం. థ్రిల్లర్‌లు, మిస్టరీలు, క్రైమ్ డ్రామా, ప్రేమ ఇలా అన్ని రకాల్ని కథల్ని అందించాలని ప్రయత్నిస్తున్నాం. ‘ఈ దీపావళి కేవలం ZEE5 తోనే ఛేంజ్ అవుతుంది.. సిద్దంగా ఉండండి’ అనే ప్రచారం ZEE5 కథలలోని మలుపుల మాదిరిగానే ఆవిష్కరణ, ఆశ్చర్యం కలిగించేలా స్ఫూర్తితో ఉంటుంది. ఇది మా ప్లాట్‌ఫామ్‌లోని ఉత్సాహాన్ని చూపుతుంది. ఈ దీపావళిని అందరికీ ప్రత్యేకంగా ఉండాలని మేం ఆశిస్తున్నామ’ని అన్నారు.

హై-ఆక్టేన్ థ్రిల్లర్‌లు, ఫ్యామిలీ డ్రామాలు, హార్ట్ టచింగ్ లవ్ స్టోరీస్ ఇలా అన్నీ కూడా ఈ పండుగ సీజన్‌లో ZEE5 అందరికీ అందుబాటులోకి తీసుకువస్తోంది.  అక్టోబర్ 13 నుండి 20 వరకు ZEE5లో జరిగే భారత్ బింగే ఫెస్టివల్‌లో చేరండి, అసాధారణ కథలతో పాటుగా ప్రత్యేకమైన ఆఫర్‌లతో ఎంజాయ్ చేయండి.

ZEE5 గురించి...

జీ5 భార‌త‌దేశ‌పు యంగ‌స్ట్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్. మల్టీలింగ్వుల్ స్టోరీటెల్ల‌ర్‌గా ప్ర‌సిద్ధి పొందింది. మిలియ‌న్ల కొద్దీ అభిమానుల‌ను సంపాదించుకుంది. గ్లోబ‌ల్ కంటెంట్ ప‌వ‌ర్ హౌస్ జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎంట‌ర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జీఎల్‌) నుంచి శాఖ‌గా మొద‌లైంది జీ5. అత్య‌ద్భుత‌మైన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ గా పేరు తెచ్చుకుంది. 3,500 సినిమాల లైబ్ర‌రీ ఉన్న ప్లాట్‌ఫార్మ్ ఇది. 1,750 టీవీ షోలు, 700 ఒరిజిన‌ల్స్, 5 ల‌క్ష‌ల‌కు పైగా ఆన్ డిమాండ్ కంటెంట్ ఈ సంస్థ సొంతం. 12 భాష‌ల్లో (హిందీ, ఇంగ్లిష్‌, బెంగాలీ, మ‌ల‌యాళం, తెలుగు, త‌మిళ్‌, మ‌రాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజ‌రాతీ, పంజాబీ)లో అందుబాటులో ఉంది. బెస్ట్ ఒరిజిన‌ల్స్, ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీస్‌, టీవీ షోస్‌, మ్యూజిక్‌, కిడ్స్ షోస్‌, ఎడ్‌టెక్‌, సినీ ప్లేస్‌, న్యూస్‌, లైవ్ టీవీ, హెల్త్, లైఫ్‌స్టైల్ విభాగాల్లో ప్రేక్ష‌కుల‌ను రంజింప‌జేస్తోంది. ఇంత గొప్ప డీప్ టెక్ స్టాక్ నుంచి ఎదిగిన ప్లాట్‌పార్మ్ కావ‌డంతో జీ5 12 భాష‌ల్లో అత్య‌ద్భుత‌మైన కంటెంట్‌ని ప్రేక్ష‌కుల‌కు అందించ‌గ‌లుగుతోంది.

ఇంకా చదవండి: అక్టోబర్ 15న "మిత్ర మండలి" మూవీ ప్రీమియర్స్

Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# ZEE5     # దీపావళి పండుగ    

trending

View More