దుల్కర్ సల్మాన్ 'వేఫేరర్ ఫిలిమ్స్' సాహసోపేతమైన అడుగు.. భారతీయ సినిమాలో కొత్త అధ్యాయాన్ని లిఖించిన 'కొత్త లోక'

దుల్కర్ సల్మాన్ 'వేఫేరర్ ఫిలిమ్స్' సాహసోపేతమైన అడుగు.. భారతీయ సినిమాలో కొత్త అధ్యాయాన్ని లిఖించిన 'కొత్త లోక'

3 months ago | 5 Views

ప్రముఖ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ కి చెందిన వేఫేరర్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన 'కొత్త లోక 1: చంద్ర' చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటోంది. వేఫేరర్ పతాకంపై నిర్మించిన ఏడవ చిత్రం ఇది. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించబడిన ఈ మలయాళ చిత్రం కేరళ సరిహద్దులను దాటి విస్తృత ప్రశంసలు అందుకుంటోంది. చిత్రానికి మాత్రమే కాకుండా దుల్కర్ సల్మాన్ మరియు వేఫేరర్ ఫిలిమ్స్ వారి దార్శనికతకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి.

మలయాళ సినిమాలో ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా అత్యంత భారీస్థాయిలో, భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రాన్ని, ఇంత సాంకేతిక పరిపూర్ణతతో నిర్మించడం ద్వారా దుల్కర్ సల్మాన్ అసాధారణమైన అడుగు ముందుకు వేశారు. దీనిని ఓ మలయాళ నిర్మాత తీసుకున్న అత్యంత సాహసోపేతమైన మరియు దూరదృష్టితో కూడిన నిర్ణయాలలో ఒకటిగా వర్ణించవచ్చు. దీనితో ఒక కొత్త సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ ప్రారంభమైంది. మలయాళ సినిమా స్థాయిని పెంచడానికి, సరిహద్దులను దాటి విస్తరించేందుకు వేఫేరర్ ఫిలిమ్స్ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. గతంలో మలయాళ ప్రేక్షకులకు అద్భుతమైన చిత్రాలను అందించిన ఈ నిర్మాణ సంస్థ.. ఇప్పుడు 'కొత్త లోక 1: చంద్ర'తో పరిశ్రమలో ఒక మైలురాయిని నెలకొల్పింది. ఈ సినిమా ద్వారా దుల్కర్ సల్మాన్ వేసిన సాహసోపేతమైన అడుగు.. ఇప్పుడు భారతీయ సినిమా చరిత్రలోనే నిలిచిపోయింది. నటుడిగానే కాకుండా, నిర్మాతగా కూడా మలయాళ సినిమాకు దుల్కర్ సల్మాన్ చేసిన కృషి.. 'కొత్త లోక 1: చంద్ర' ద్వారా వ్రాయబడుతున్న చరిత్రతో పాటు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.


'కొత్త లోక 1: చంద్ర' చిత్రం ఇంత గొప్పగా రూపుదిద్దుకోవడంలో డొమినిక్ అరుణ్ కీలక పాత్ర పోషించారు. రచయితగా, దర్శకుడిగా ఆయన సినిమాను అద్భుతంగా దృశ్యమానం చేసి, తన నైపుణ్యంతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఛాయాగ్రాహకుడు నిమిష్ రవి అద్భుతమైన విజువల్స్ అందించారు. ఇది నిజంగా మలయాళ సినిమానేనా అని ఆశ్చర్యపోయేలా విజువల్స్ ఉన్నాయి. కళా దర్శకులు బంగ్లాన్, జితు సెబాస్టియన్ తమ అసాధారణ ప్రతిభతో కథకు తగ్గట్టుగా మనోహరమైన, శక్తివంతమైన మరియు రహస్యమైన ప్రపంచాన్ని అద్భుతంగా నిర్మించారు. కథలోని భావోద్వేగ లోతును ప్రేక్షకులకు మరింత చేరువ చేసేలా గొప్ప నేపథ్య సంగీతం అందించిన స్వరకర్త జేక్స్ బెజోయ్ కి కూడా ప్రశంసలు అందుతున్నాయి. అలాగే చమన్ చాకో కూర్పు, అంతర్జాతీయ స్టంట్ నిపుణుడు యానిక్ బెన్ కొరియోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన బలాలుగా నిలిచాయి. 

ఈ చిత్రానికి కేరళలో మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. దాంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. టైటిల్ రోల్ పోషించిన కళ్యాణి ప్రియదర్శన్ తన అద్భుతమైన నటనకు ప్రశంసలు అందుకుంటున్నారు. ఇతర ముఖ్య పాత్రలలో కనిపించిన నస్లెన్, శాండీ, చందు సలీం కుమార్, అరుణ్ కురియన్, విజయరాఘవన్, శరత్ సభతో పాటు అతిథి పాత్రలు పోషించిన నటులు కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఈ సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ లో మొదటి భాగంగా వచ్చిన 'కొత్త లోక 1: చంద్ర'.. ప్రేక్షకుల హృదయాల్లో విజయవంతంగా బలమైన పునాది వేసింది.

'కొత్త లోక 1: చంద్ర' చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పంపిణీ చేశారు. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన వసూళ్లను సాధిస్తూ.. బాక్సాఫీస్ వద్ద తుఫాన్ సృష్టిస్తోంది. మొదటి షో నుండే థియేటర్ల వద్ద భారీ జనసందోహం కనిపించింది. ఇది సినిమా పట్ల ప్రేక్షకుల ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ చిత్రం అన్ని వర్గాల నుండి విశేష స్పందనతో ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. రాబోయే రోజుల్లో అద్భుతమైన ప్రదర్శనతో ఎన్నో ఘనతలు సాధిస్తుందనే నమ్మకాన్ని కలిగిస్తోంది. 

ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు – జోమ్ వర్గీస్, బిబిన్ పెరుంబల్లి, అదనపు స్క్రీన్ ప్లే – శాంతి బాలచంద్రన్, మేకప్ – రోనాక్స్ జేవియర్, కాస్ట్యూమ్ డిజైనర్లు – మెల్వీ జె, అర్చన రావు, స్టిల్స్ – రోహిత్ కె సురేష్, అమల్ కె సదర్, ప్రొడక్షన్ కంట్రోలర్స్ – రిని దివాకర్, వినోష్ సురేష్ కైమోల్, చీఫ్ అసోసియేట్ - సుజిత్ సురేష్
ఇంకా చదవండి: ‘గ్రాండ్ పేరెంట్స్ డే’ని ముందుగానే సెలెబ్రేట్ చేసేందుకు గ్రాండ్ పేరెంట్స్‌‌కి చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించనున్న ‘త్రిబాణధారి బార్బరిక్’ టీం
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
#     

trending

View More