సినిమా విడుదలై ఏడాది దాటినా తగ్గని క్రేజ్!
4 months ago | 5 Views
ఊహించని మలుపులు, అర్థంకానీ మిస్టరీలతో సాగే చిత్రాలు ఇప్పుడు సినీప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మనం ప్రతివారం థియేటర్లలో, ఓటీటీలో వచ్చే కొత్త సినిమాల గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమాకుడా అలాంటిదే.. ఈ సినిమా విడుదలై ఏడాది దాటింది. ఆ సినిమా పేరు ‘కిష్కింధ కాండమ్: ఎ టేల్ ఆఫ్ 3 వైజ్ మంకీస్’. 8 IMDb రేటింగ్‌తో ఉన్న ఈ సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ మిమ్మల్ని షాక్‌కు గురి చేస్తుంది. సెప్టెంబర్ 2024లో సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. రూ. 7 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం దాదాపు 11 రెట్లు ఎక్కువ అంటే ప్రపంచవ్యాప్తంగా రూ. 75 కోట్లు వసూలు చేసింది.
ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. కథలోకి వెళితే.. ఒక చిన్న పట్టణంలో ఉండే ఒక కుటుంబ కథతో ఈ సినిమా మొదలవుతుంది. ఇది చాలా మలుపులు తిరుగుతుంది. ఆ కుటుంబంలో హీరో తండ్రి జ్ఞాపకశక్తిని కోల్పోయి తన తుపాకీలలో ఒకటి ఎక్కడ ఉందో మరచిపోతాడు. అతని కుటుంబం, పోలీసులు ఆ తుపాకీ కోసం వెతుకుతారు. ఈ సినిమా పేరు రామాయణంలోని కిష్కింధ కాండ నుండి తీసుకున్నారు. అందులో సుగ్రీవుడు, వాలి మధ్య పోరాటం జరుగుతుంది. ఈ సినిమా కథ అజయేట్టన్, అపర్ణ, అప్పు పిళ్ళై అనే ముగ్గురు వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా అజయేట్టన్, అపర్ణల కోర్టు వివాహంతో ప్రారంభమవుతుంది. అప్పు ఇండియన్ ఆర్మీలో పనిచేశాడు.
అతను ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడు. అతని దగ్గర లైసెన్స్ పొందిన తుపాకీ ఉంటుంది. జిల్లాలో ఎన్నికలు ఉండడంతో ప్రతి ఒక్కరూ తమ తుపాకులను డిపాజిట్ చేయాలి. అయితే అప్పు పిళ్లై తుపాకీ ఎక్కడ పెట్టాడో మర్చిపోతాడు. దీంతో ఆ తుపాకీ కోసం అందరూ వెతుకుతుంటారు. ఆద్యంతం మలుపులతో సాగే ఈ సినిమా మిమ్మల్ని కట్టిపడేస్తుంది. ఈ సినిమా ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మలయాళంలో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు హిందీ, తమిళం, తెలుగు భాషలలో ఓటీటీలో అందుబాటులో ఉంది.
ఇంకా చదవండి: ఘనంగా ‘రాజు గాని సవాల్’ ట్రైలర్ లాంఛ్..ఆగస్టు 8న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!




