'కానిస్టేబుల్ కనకం' హై ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నాం : దర్శకుడు ప్రశాంత్ & ఈటీవీ విన్ టీం
5 months ago | 5 Views
వర్ష బొల్లమ్మ టైటిల్ రోల్ లో నటించిన వెబ్ సిరీస్ 'కానిస్టేబుల్ కనకం'. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో కోవెలమూడి సత్య సాయిబాబా, వేటూరి హేమంత్ కుమార్ నిర్మించారు. రాజీవ్ కనకాల, మేఘ లేఖ, రమణ భార్గవ్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా మేకర్స్ ఈ ప్రాజెక్ట్ కి సంబధించి ఒక ముఖ్యమైన ప్రెస్ మీట్ నిర్వహించారు.
ప్రెస్ మీట్ లో దర్శకుడు ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ ని అందరం చాలా కష్టపడి చేశాం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒక మంచి సందర్భంలో మిమ్మల్ని అందరిని కలవాలి అనుకున్నాం. కానీ ఇలాంటి సిచువేషన్ వస్తుందని మేము ఊహించలేదు. ఈ మధ్యకాలంలో ఇదే కథతో వేరే ఓటీటీ సంస్థ నిర్మించిన ఒక ట్రైలర్ బయటకు వచ్చింది. అది చూసి మేము షాక్ అయ్యాము. న్యాయస్థానాన్ని ఆశ్రయించాము. కోర్టులో కేసు నడుస్తోంది. నిజానికి ఇలాంటి పరిస్థితి వస్తుందని మేము ఊహించలేదు. చాలా బాధగా ఉంది. ఒక దర్శక, రచయితగా కథని ఎంతో మందికి చెప్తాను. ఈ క్రమంలో ఒక సంస్థకి కథ చెప్పడం జరిగింది. అన్ని మెయిల్స్ రూపంలో వాళ్లకి పంపడం జరిగింది. కొంత వర్క్ అయిన తర్వాత వాళ్లు వద్దనుకున్నారు. తర్వాత నేను మరో ప్రయత్నం చేసుకున్నాను. అలా ఈటీవీ విన్ లోకి వచ్చాను. ఇక్కడ ప్రాజెక్టు సెట్స్ పైకి తీసుకెళ్ళాం. ఇలా ఇప్పుడు అదే కథతో ఆ సంస్థ నుంచి సిరిస్ ట్రైలర్ కనిపిస్తుంది. మా దగ్గర అన్ని ఆధారాలు వున్నాయి. ఈ విషయంలో మేము న్యాయ పోరాటం చేస్తున్నాం'అన్నారు.
ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ మాట్లాడుతూ... అందరికి నమస్కారం. కానిస్టేబుల్ కనకం ఈటీవీ విన్ ఒరిజినల్ సిరీస్. మేము దేని నుంచి కాపీ కొట్టలేదు. సినిమా వచ్చిన తర్వాత చేసేది పైరసీ అంటారు. అసలు రాకముందే ఇలా చేసేవారిని ఏమనాలో అర్ధం కావడం లేదు. అదే స్టోరీ స్క్రీన్ ప్లే క్యారెక్టర్స్ కాపీ కొట్టి తీస్తే ఏమనాలో మీరే చెప్పాలి. ఈ కథ 2022లో రిజిస్టర్ చేసాం. కానిస్టేబుల్ కనకం సీజన్ 1, సీజన్ 2 ని ఈటీవీలో చాలా ప్రెస్టీజియస్ గా రూపొందిస్తున్నాం. మేము తీస్తున్న వాటిలో వెరీ కాస్ట్లీ అండ్ హై ప్రోడక్షన్ వాల్యూస్ ఉన్న వెబ్ సిరీస్ ఇది. మరోసారి చెప్తున్నాం.. కానిస్టేబుల్ కనకం ఒరిజినల్ మేడ్ బై ఈటీవీ విన్. దీనిపై కేసు కోర్టు అండర్ లో ఉంది. అందుకే పేర్లను ప్రస్తావించడం లేదు. ఒకసారి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఆ జడ్జిమెంట్ కాపీస్ అందరికీ షేర్ చేస్తాం. ఇలాంటివి చేయడం చాలా తప్పు. ఇలా జరగకుండా చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. తప్పకుండా మేము దీనిపై న్యాయపోరాటం చేస్తాం. దీనికోసం ఎంతవరకైనా వెళ్తాం'అన్నారు.
ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఒక ఒరిజినల్ కథను తీసుకొని అందులో ఓ మెలిక పెట్టినంత మాత్రాన అది అసలైన కథ కాదు. దొంగతనమే అవుతుంది. ఈటీవీ ఎంతో గొప్ప లెగసి ఉన్న సంస్థ. అలాంటి సంస్థలోని ఒక ప్రాజెక్టు ఇలా చేశారంటే అందులో ఉన్న దుర్మార్గాన్ని గమనించాలి. ఇది కరెక్ట్ కాదు. హై బడ్జెట్, ప్రొడక్షన్ వాల్యూస్ తో ఈ ప్రాజెక్టు చేస్తున్నాము. ఈటీవీ కన్న కల ఇది. ఈటీవీ నుంచి ఒక పాన్ ఇండియా నేషనల్ విజువల్స్ ఎలా ఉంటాయో ఈ ప్రాజెక్టు ద్వారా చూపించాలి అనుకున్నాం. అలాంటిది ఇంత హుటాహుటిగా ఉన్న ఫుటేజ్ నే మీడియాకి చూపించే పరిస్థితి రావడం దురదృష్టకరం. దొంగతనం చేస్తాం ముందుగా వస్తే దొరలయిపోతాం అనే ఆలోచనతో ఇలాంటి దుర్మార్గమైన పనులు చేస్తున్నారు. ఇది చాలా బాధతో ఇది చెప్తున్నాను. మా ట్రైలర్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి కాపీ కొట్టామని జనాలు మాట్లాడతారు. కానీ లోపల జరిగిన విషయం ఎవరికీ తెలియదు. ఈ సినిమాని ఈ ప్రాజెక్టు క్రియేట్ చేసుకోవడానికి ఎంత కష్టపడ్డామో బయటకు తెలియదు. ఈ విషయంలో మేము ఎలాంటి న్యాయపోరాటానికైనా సిద్ధమే' అన్నారు. ఈ ప్రెస్ మీట్ లో చిత్ర నిర్మాతలు కూడా పాల్గొన్నారు.
ఇంకా చదవండి: "పోలీస్ వారి హెచ్చరిక " టీజర్ ను ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!




