‘విశాల్ 35’ ప్రాజెక్ట్‌లో అంజలి
3 months ago | 5 Views
అంజలి ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా పాత్రలను ఎంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విశాల్ 35వ ప్రాజెక్ట్‌లోకి అంజలి వచ్చేశారు. వరుస సక్సెస్‌లతో ఉన్న విశాల్ ఇప్పుడు తన కెరీర్‌లో 35వ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించారు. చివరగా ‘మద గద రాజా’ అంటూ అంజలి, వరలక్ష్మీ శరత్ కుమార్‌లతో విశాల్ చేసిన సందడికి కాసుల వర్షం కురిసింది. మళ్లీ ఇప్పుడు విశాల్, అంజలి కాంబోలో సినిమా రాబోతోంది. విశాల్ 35 ప్రాజెక్ట్‌ని ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి ప్రతిష్టాత్మక బ్యానర్ సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది.
తాజాగా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీలో అంజలి కీలక పాత్రను పోషించబోతోన్నారు. ఈ మేరకు విశాల్ 35 ప్రాజెక్ట్‌లోకి అంజలి వచ్చేశారన్నట్టుగా టీం ప్రకటించింది. ఈ మూవీకి ఎన్.బి. శ్రీకాంత్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. దురైరాజ్ కళా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. మార్క్ ఆంటోనీ విజయం తర్వాత జి.వి. ప్రకాష్ కుమార్ మరోసారి ఈ చిత్రానికి విశాల్‌తో కలిసి పనిచేస్తున్నారు. నటి దుషార విజయన్ విశాల్ సరసన కథానాయికగా నటించనున్నారు.
ఈ కొత్త చిత్రానికి రవి అరసు దర్శకత్వం వహించనున్నారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం. నాథన్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. నటుడు విశాల్, దర్శకుడు రవి అరసు కాంబోలో ఇది మొదటి చిత్రం. ముఖ్యంగా ‘మధ గజ రాజా’ చిత్రం ఘన విజయం తర్వాత విశాల్ మరోసారి సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం. నాథన్‌తో జతకట్టడం విశేషం.
ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు చెన్నైలో అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. దర్శకుడు వెట్రిమారన్, శరవణ సుబ్బయ్య (సిటిజన్), మణిమారన్ (NH4), వెంకట్ మోహన్ (అయోగ్య), శరవణన్ (ఎంగేయుమ్ ఎప్పోదుం), నటులు కార్తీ, జీవా, డిఓపి ఆర్థర్ ఎ విల్సన్, పంపిణీదారు తిరుప్పూర్ సుబ్రమణ్యం వంటి ప్రముఖులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరై యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సినిమాకు సంబంధించిన ఇతర వివరాల్ని త్వరలోనే ప్రకటించనున్నారు.
తారాగణం : విశాల్, దుషార విజయన్, అంజలి, తంబి రామయ్య, అర్జై తదితరులు
సాంకేతిక సిబ్బంది
నిర్మాణ సంస్థ: సూపర్ గుడ్ ఫిల్మ్స్
నిర్మాత: ఆర్‌బి చౌదరి
దర్శకుడు: రవి అరసు
సంగీత దర్శకుడు: జి.వి. ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రాఫర్: రిచర్డ్ ఎం. నాథన్
ఎడిటర్: ఎన్‌బి శ్రీకాంత్
కళా దర్శకుడు: జి. దురైరాజ్
కాస్ట్యూమ్ డిజైనర్: వాసుకి భాస్కర్
పీఆర్వో : సాయి సతీష్
ఇంకా చదవండి: ఎమోషనల్‌గా కట్టి పడేసే ‘బ్యూటీ’ టీజర్.. సెప్టెంబర్ 19న గ్రాండ్ రిలీజ్
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# విశాల్ 35 # అంజలి




