'మహాకాళి' నుంచి అసురుల గురువు శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా ఫస్ట్ లుక్ రిలీజ్
2 months ago | 5 Views
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో తొలి చిత్రం హనుమాన్ పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ఈ యూనివర్స్ లో నెక్స్ట్ ఇంస్టాల్మెంట్ మహాకాళి. దీనిని ఆర్.కె.డి స్టూడియోస్ బ్యానర్ పై రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మించారు.ఆర్.కె దుగ్గల్ సమర్పిస్తున్నారు. ప్రశాంత్ వర్మ క్రియేటర్, షోరన్నర్‌గా వ్యవహరిస్తుండగా, పూజ అపర్ణ కొల్లూరు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బ్లాక్‌బస్టర్ ఛావాలో ఔరంగజేబు పాత్రను అద్భుతంగా పోషించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన బాలీవుడ్ స్టార్ అక్షయ్ ఖన్నా మహాకాళిలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇది ఆయనకి తెలుగులో తొలి చిత్రం. ఛావా విజయం తర్వాత ఆఫర్లు వెల్లువెత్తినప్పటికీ, కథ బలం, అతని పాత్ర డెప్త్ ద్వారా అక్షయ్ తన తెలుగు రిలీజ్ కోసం మహాకాళిని ఎంచుకున్నారు.
అక్షయ్ పాత్రను పరిచయం చేస్తూ, సినిమాలోని అతని ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. హిందూ పురాణాలలో అసురుల గురువు శుక్రాచార్యుడు గా ఒక భారీ పర్వత కోట ముందు నిలబడి ఉన్నట్లు ప్రజెంట్ చేసిన లుక్ అదిరిపోయింది. తపోవ్రత వస్త్రాలు, చీకటినీ చీల్చే కాంతివంతమైన కళ్ళతో శుక్రాచార్యుడి రూపం అద్భుతంగా దర్శనమిస్తుంది. దేవతలూ – దానవులూ ఇద్దరి భవితవ్యాన్ని మలిచిన మహర్షిగా, ఆయనను చిత్రంలో అద్భుతమైన పాత్ర చూపించబోతున్నారు. శుక్రాచార్యుడు కేవలం ఋషి మాత్రమే కాదు, జ్ఞానం, విరోధం, విశ్వాధికారానికి ప్రతీకగా సజీవ చిహ్నంగా చూపించారు. సనాతన విద్యకు ఆచార్యుడు, మరణించిన వారిని బతికించగల మృత-సంజీవని మంత్రం రహస్యం తెలిసిన శుక్రాచార్యుడు అసురుల ఆధ్యాత్మిక మార్గదర్శకుడు మాత్రమే కాదు, అపారమైన వ్యూహకర్త.
ఈ చిత్రానికి సంగీతాన్ని స్మరణ్ సాయి అందించగా, సినిమాటోగ్రఫీని సురేష్ రగుతు నిర్వహిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా శ్రీ నాగేంద్ర తంగాల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వెంకట్ కుమార్ జెట్టి వ్యవహరిస్తున్నారు.
మహాకాళి చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. ఇప్పటికే 50 శాతం షూట్ పూర్తి కాగా, డిసెంబర్ నాటికి మొత్తం ప్రొడక్షన్ పూర్తి చేస్తారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సైమల్టేనియస్ కొనసాగుతున్నాయి. విడుదల తేదీని త్వరలోనే మేకర్స్ అనౌన్స్ చేస్తారు
తారాగణం: అక్షయ్ ఖన్నా
సాంకేతిక సిబ్బంది:
క్రియేటర్: ప్రశాంత్ వర్మ
బ్యానర్: ఆర్.కె.డి స్టూడియోస్
నిర్మాత: రివాజ్ రమేష్ దుగ్గల్
దర్శకత్వం: పూజ అపర్ణ కొల్లూరు
సంగీతం: స్మరణ్ సాయి
డీఓపీ: సురేష్ రగతు
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి
ఎడిటర్: సాయిబాబు తలారి
కాస్ట్యూమ్ డిజైనర్: శిల్పా GNS
పబ్లిసిటీ: అనంత్ కంచెర్ల
పీఆర్ ఓ : వంశీ-శేఖర్
ఇంకా చదవండి: శ్రీమురళి చిత్రం 'పరాక్' ప్రారంభం
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# మహాకాళి # అక్షయ్ ఖన్నా




