ఆది పినిశెట్టి ఎంగేంజింగ్ థ్రిల్లర్ మూవీ

ఆది పినిశెట్టి ఎంగేంజింగ్ థ్రిల్లర్ మూవీ "డ్రైవ్" టీజర్ రిలీజ్

1 hour ago | 5 Views

ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్న థ్రిల్లర్ మూవీ "డ్రైవ్". ఈ చిత్రంలో మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్ గా కనిపించనుంది. "డ్రైవ్" సినిమాను భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. జెనూస్ మొహమద్ దర్శకత్వం వహించారు. ఈ నెల 12న "డ్రైవ్" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.


"డ్రైవ్" సినిమా టీజర్ ఎలా ఉందో చూస్తే - తన తండ్రి స్థాపించిన ప్రజా మీడియా కార్పొరేషన్ వారసుడిగా సంస్థను విజయవంతంగా నిర్వహిస్తుంటాడు హీరో ఆది పినిశెట్టి. సౌత్ ఇండియాలో పేరున్న ఈ సంస్థ అక్కౌంట్స్ ను ఒక హ్యాకర్ హ్యాక్ చేస్తాడు. ఈ హ్యాక్ తో ప్రజా మీడియా కార్పొరేషన్ గౌరవం, క్రెడిబిలిటీ ప్రశ్నార్థకంలో పడతాయి. ఈ హ్యాకర్ ఎవరు ?, ప్రజా మీడియా కార్పొరేషన్ తో పాటు హీరో పర్సనల్ లైఫ్ ను ఎందుకు టార్గెట్ చేశాడు ?. ఆ హ్యాకర్ ను హీరో పట్టుకోగలిగాడా ? లేదా ? అనేది టీజర్ లో ఆసక్తి కలిగిస్తోంది.

నటీనటులు - ఆది పినిశెట్టి, మడోన్నా సెబాస్టియన్, రాజా చెంబోలు, కమల్ కామరాజు, అనీశ్ యోహాన్ కురువిల్లా, తదితరులు

టెక్నికల్ టీమ్

మ్యూజిక్ డైరెక్టర్ - ఓషో వెంకట్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - అన్నే రవి

క్రియేటివ్ ప్రొడ్యూసర్ - తాతినేని సత్యరావు

డీవోపీ - అబినందన్ రామానుజన్

ఎడిటర్ - ప్రవీణ్ పూడి

ప్రొడక్షన్ డిజైనర్ - వివేక్ అన్నామలై

యాక్షన్ - మరేక్ సోలెక్

డైలాగ్స్ - నాగసాయి

పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)

బ్యానర్ - భవ్య క్రియేషన్స్

నిర్మాత - వి. ఆనంద్ ప్రసాద్

రైటర్, డైరెక్టర్ - జెనూస్ మొహమద్

ఇంకా చదవండి: సామాజిక స్పృహ‌తో 'దండోరా'

Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# ఆది పినిశెట్టి     # డ్రైవ్    

trending

View More