'తెప్పసముద్రం' మూవీ రివ్యూ :  ఆకట్టుకునే   క్రైం థ్రిల్లర్!

'తెప్పసముద్రం' మూవీ రివ్యూ : ఆకట్టుకునే క్రైం థ్రిల్లర్!

1 month ago | 7 Views

ఎప్పుడూ రొటీన్ కథలను చూసి విసిగిపోయిన ప్రేక్షకులు ఓ మాంచి క్రైం థ్రిల్లర్ సినిమాను చూస్తే... ఆ మజాయే వేరు. అందుకే నూతన నిర్మాతలు, దర్శకులు ఇలాంటి సస్పెన్స్ క్రైం స్టోరీస్ పై దృష్టి సారించి... ప్రేక్షకులకు ఓ విభిన్నమైన అనుభూతని కలిగిస్తుంటారు. అలాంటి కోవకు చెందినదే ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘తెప్పసముద్రం’. ఇందులో ‘బిగ్ బాస్’ ఫేం అర్జున్ అంబటి, కిశోరి దాత్రక్ జంటగా నటించారు. యువ హీరో చైతన్యరావు ఇందులో ఓ పవర్ ఫుల్ పోలీసు పాత్రలో కనిపిస్తారు. సతీష్ రాపోలు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బేబీ వైష్ణవి సమర్పణలో శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్  నిర్మించారు. ఈ చిత్రానికి పి.ఆర్ సంగీతం అందించారు. మరి ఈ మర్డర్ మిస్టరీ మూడీ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకుందో చూద్దాం పదండి.

స్టోరీ: తెప్పసముద్రం అనే గ్రామంలో వరుసగా విద్యార్థినులు మాయమవుతూ ఉంటారు. దాంతో ఆ ఊరిలో విద్యార్థినుల తల్లిదండ్రులతో పాటు... గ్రామస్తులు, వారికి చదువు చెప్పే గురువులు అంతా బెంబేలెత్తిపోతుంటారు. ఇలా విద్యార్థినులు మాయం ఎందుకు అవుతున్నారనేదానిని ఇన్వెస్టిగేషన్ చేయడానికి అదే గ్రామానికి చెందిన గణేష్(చైతన్యరావు) వస్తారు. విద్యార్థినులు ఎందుకు మిస్ అవుతున్నారనేదానికి వివిధ రకాల కోణాల్లో విచారణ జరపుతారు. కానీ ఓ పట్టాన ఆ మిస్టరీని చేధించడం కష్టం అవుతుంది. అదే సమయంలో అదే గ్రామానికి చెందిన ఇందు(కిశోరి దాత్రిక్)ను గణేష్ ప్రేమిస్తారు. అయితే ఆమె ఆటోడ్రైవర్ అయిన విజయ్ (అర్జున్ అంబటి)ని ప్రేమిస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మిస్సింగ్ అయిన అమ్మాయిల ఆచూకీని ఎస్.ఐ.గణేష్ కనుగొన్నారా? వీరి ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎలాంటి మలుపు తీసుకుంది? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

సినిమా ఎలా ఉందంటే...

సస్పెన్స్ మర్డర్ థ్రిల్లర్ సినిమాలకు ప్రధాన బలం స్క్రీన్ ప్లే. ప్రేక్షకులను ఎంగేజ్ చేయగలిగే స్క్రీన్ ప్లేను ఇంట్రెస్టింగ్ గా రాసుకోగలితే... అలాంటి సినిమాల విజయాలకు కొదువేమీ ఉండదు. ఇలాంటి కథ... కథనాలతో నడిచే సినిమానే ‘తెప్పసముద్రం’. అనగనగా ఓ ఊరు... ఆ ఊళ్లో అభం శుభం  తెలియని చిన్నారులపై దారుణంగా అత్యాచాలకు పాల్పడే సైకో... చివరకు అతనిని అంతమొదించడం... ఇలాంటి కథకు అనేక ట్విస్టులు ఇచ్చి... స్క్రీన్ ప్లేను చాలా ఆసక్తికరంగా నడిపించారు దర్శకుడు. చివరి వరకు అసలు హంతకుడు ఎవరనేది ప్రేక్షకులు ఓ పట్టాన కన్ ఫర్మేషన్ కు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని సినిమాని ఆసక్తికరంగా ఆవిష్కరించారు. దాంతో ఆడియన్ ఎక్కడా బోరింగ్ గా ఫీల్ అవ్వడు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ తో సినిమాపై మరింత ఆసక్తిని పెంచేసి... ద్వితీయార్థం అంతా ట్విస్టులతో సినిమాని భలే ఎంగేజ్ చేశారు దర్శకుడు సతీష్. తను అనుకున్న కథను యాజ్ టీజ్ గా తెరమీద చూపించారు. హాజీపూర్ సంఘటనలాంటి వాస్తవ సంఘటను కొంత బేస్... చేసుకున్నా... అందులో వచ్చే మలుపులు ఆడియన్స్ ను బాగా థ్రిల్లింగ్ కు గురిచేస్తాయి. ఇందులోనే ఓ సోషియల్ మెసేజ్ కూడా ఇచ్చారు దర్శకుడు. మంచి కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. గో అండ్ వాచ్.

ఆర్టిస్టుల పనితీరు...

ఇందులో ఆటోడ్రైవర్ గా, హీరోయిన్ అవర్ గా విజయ్ పాత్రలో నటించిన అర్జున్ అంబటి తన నటనతో ఆకట్టుకున్నారు. డ్యాన్సులు కూడా బాగానే చేశారు. అతనికి జోడీగా నటించిన కిశోరి దాత్రిక్ కూడా తన పరిధిమేరకు నటించి మెప్పించింది. ఇందులో విలన్ పాత్రలో గజాగా నటించిన చైతన్య దాత్రిక్ కూతురే ఈ అమ్మాయి కావడం విశేషం. తండ్రీకూతుళ్లు ఇద్దరూ ఇందులో నటించడం ఆసక్తికరం. యువనటుడు చైతన్య రావు ఇందులో  కీలకమైన పాత్రలో నటించి మెప్పించారు. బహుశ ఇతను కేరీర్ లో ఇలాంటి పాత్రను పోషించలేదనే చెప్పొచ్చు. అతని తండ్రి పాత్రలో రవిశంకర్... లాయర్ విశ్వనాథ్ గా చాలా బరువైన పాత్రను పోషించి ఆకట్టుకున్నారు. అతనికి భార్యగా నటించిన ఆమె కూడా బాగానే నటించారు. ఇక మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధిమేరకు నటించి ఆకట్టుకున్నారు.

టెక్నీషియన్స్ గురించి...

దర్శకుడు సతీష్ రాపోలు... ఓ వైవిధ్యమైన కథ... కథనాలతో సినిమాను తెరకెక్కించి విజయం సాధించారు. ఇలాంటి కథలకు సమాజంలో మన చుట్టూ జరిగే కొన్ని వాస్తవ ఘటనలు అయివుండొచ్చు. అయితే వాటిని తెరమీద చూపించేటప్పుడు కొంత సినిమాటిక్ లిబర్టీ తీసుకుని తీయగలిగితే ఆ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని దర్శకుడు నిరూపించారు. ఆద్యంతం మలుపులతో ఆడియన్స్ ను థ్రిల్ గురిచేశారు. సినిమాటోగ్రీఫి పర్వాలేదు. ద్వితీయార్థంలో విజువల్స్ రిచ్ గా ఉన్నాయి. సంగీతం బాగుంది. పాటలు మాస్ ను బాగా ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ గ్రిప్పింగ్ గా ఉంది. నిర్మాతలు ఎక్కడా ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను నిర్మించారు. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఇలాంటి జోనర్ సినిమాలను ఇష్టపడే వారు ఓసారి చూసేయండి.

రేటింగ్: 3.25

ఇంకా చదవండి: 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' మూవీ రివ్యూ..

# TheppaSamudram     # ArjunAmbati     # KishoriDhatrak    

trending