ప్రసన్న వదనం మూవీ రివ్యూ :  థ్రిల్ ని కలిగించే థ్రిల్లర్!

ప్రసన్న వదనం మూవీ రివ్యూ : థ్రిల్ ని కలిగించే థ్రిల్లర్!

16 days ago | 23 Views

రేటింగ్: 3.25/5

నవతరం హీరో సుహాస్ జర్నీ వైవిధ్యంగా సాగుతోంది. ఫ్యామిలీ డ్రామా, కలర్ ఫోటో, అంబాజీపేట.. ఇలా తన విలక్షణమైన సినిమాలతో ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. తాజాగా తన నుంచి 'ప్రసన్న వదనం' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుకుమార్ వద్ద పని చేసిన అర్జున్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు.  ట్రైలర్ లో చూపించిన ఫేస్ బ్లైండ్ నెస్ కాన్సెప్ట్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. మరి ఈ కాన్సెప్ట్ వర్క్ అవుట్ అయ్యిందా?  కొత్త దర్శకుడు కొత్త కాన్సెప్ట్ ని ఎలా ప్రజెంట్ చేశాడు ? సుహాస్ ఖాతలో మరో హిట్ పడిందా? తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్ళాల్సిందే... 

కథ: సూర్య(సుహాస్) ఓ యాక్సిడెంట్ లో తల్లితండ్రులని కోల్పోతాడు.   బోనస్ గా తనకో వింత డిజార్డర్ కూడా వస్తుంది. యాక్సిడెంట్ బలంగా తలకి గాయం అవ్వడంతో ఫేస్ బ్లైండ్ నెస్ డిజార్డర్ వస్తుంది. అంటే .. తను మొహాలని గుర్తుంచలేడు. ఓ ఎఫ్ఎం స్టేషన్ లో ఆర్జే గా పని చేస్తున్న సూర్య ఓ అర్ధరాత్రి దారుణమైన ఘటన చూస్తాడు. అమృత ( సాయి శ్వేత) అనే అమ్మాయిని ఎవరో లారీ కింద తోసేస్తారు. ఈ ఘటనని ప్రత్యక్షంగా చూస్తాడు సూర్య. అయితే  తనకి ఫేస్ బ్లైండ్ నెస్ వుండటం కారణంగా ఆ తోసిన వ్యక్తి ఎవరని గుర్తుపట్టలేడు. మరుసటి రోజు అది ఓ యాక్సిడెంట్  అని  వార్తల్లో వస్తుంది. దీంతో బాదితురాలికి న్యాయం జరగాలని భావించిన సూర్య.. పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి జరిగిన అసలు సంగతి చెబుతాడు. ఈ కేసుని ఎసిపీ వైదేహి( రాశి సింగ్) ఎస్ఐ( నితిన్ ప్రసన్న) చాలా సీరియస్ గా తీసుకుంటారు. మరి వారి  విచారణలో ఎలాంటి నిజాలు రాబట్టారు? ఫేస్ బ్లైండ్ నెస్ కారణంగా సూర్య ఎలాంటి కష్టాలు ఎదుర్కున్నాడు ? అసలు అమృతని చంపాల్సిన అవసరం ఎవరికి వుంది ?  ఇవన్నీ తెరపై చూడాలి. 

విశ్లేషణ:   టాలీవుడ్ లో ఫేస్ బ్లైండ్ నెస్ కాన్సెప్ట్ తో  ఇప్పటివరకూ సినిమా రాలేదు. ఇలాంటి కొత్త పాయింట్ ని తీసుకున్న దర్శకుడు అర్జున్ ఆ పాయింట్ అంతే కొత్తగా తెరపై చూపించి థ్రిల్ చేశాడు. సూర్య తల్లితండ్రులు యాక్సిడెంట్ లో చనిపోవడం, సూర్యకి ఫేస్ బ్లైండ్ నెస్ రావడం, దాంతో అతను పడే ఇక్కట్లు, అధ్య ( పాయల్ రాధకృష్ణ) రూపంలో ఓ క్యూట్ లవ్ స్టొరీ.. ఇవన్నీ ఆసక్తికరంగా ముందుకు సాగుతాయి. కథలో క్రైమ్ ఎలిమెంట్ వచ్చిన  తరవాత కథనం మరింత వేగంగా ముందుకు సాగుతుంది.  ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. నిజమైన థ్రిల్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. సెకండ్ హాఫ్ ని మరింత గ్రిప్పింగ్ గా నడిపాడు దర్శకుడు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ ట్విస్ట్ ని ఎవరూ పసిగట్టలేరు. అంత బలంగా రాసుకున్నాడు దర్శకుడు. క్లైమాక్స్ ఈ సినిమాకి మరో ఆకర్షణ. అప్పటివరకూ కొంత నిదానంగా అనిపించినప్పటికీ ఈ కథకు ఇచ్చిన ముగింపు క్లాప్స్ కొట్టేలా వుంటుంది.   సూర్య పాత్రలో సహజంగా ఒదిగిపోయాడు సుహాస్. ఎమోషనల్ సీన్స్ లో తన నటన  కట్టిపడేస్తుంది. యాక్షన్ సీక్వెన్స్ లలో అదరగొట్టాడు. యాక్షన్ ని చాలా రియల్ గా డిజైన్ చేశారు. పాయల్ లవ్ ట్రాక్ బావుంది. ఆ పాత్రని క్లైమాక్స్ లో వాడుకున్న తీరు ఇంకా బావుంది. రాశి సింగ్ పాత్ర గురించి ఎక్కువ చెప్పకూడదు. అది థియేటర్స్ లోనే చూడాలి. నితిన్ మరోసారి సహజత్వంతో ఆకట్టుకున్నాడు. హర్ష కొన్ని సీన్స్ లో నవ్విస్తాడు. రెండు సీన్స్ లో కనిపించిన సత్య కూడా తనవంతుగా నవ్వులు పూయిస్తాడు. నందుతో పాటు మిగతా నటీనటులు  పరిధిమేరకు వున్నారు.  కొత్త దర్శకులు కొత్త కాన్సెప్ట్ లతో మ్యాజిక్స్ చేస్తున్నారు. 'ప్రసన్న వదనం' దర్శకుడు అర్జున్ తన తొలి ప్రయత్నంలోనే ఫేస్ బ్లైండ్ నెస్ అనే యూనిక్ కాన్సెప్ట్ ని తీసుకొని సినిమాని ఆద్యంతం ఆసక్తికరంగా నడపడంలో విజయం సాధించాడు. యాక్సిడెంట్ సన్నివేశంతో మొదలైన కథ తర్వాత హీరో ఫేస్ బ్లైండ్ నెస్ క్యారెక్టర్ ని ఎస్టాబ్లెస్ చేస్తూ ఆసక్తికరంగా ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో సూర్య,  అధ్య మధ్యలో  వచ్చే సన్నివేశాలు, హీరో క్యారెక్టర్ చుట్టూ రాసుకున్న సన్నివేశాలు సరదాగా సాగిపోతాయి.  ఎప్పుడైతే కథలో క్రైమ్ ఎలిమెంట్ వచ్చిందో అప్పటి నుంచి కథనం పరుగులుపెడుతుంది. ఇంటర్వెల్ వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులు షాక్ ఇస్తుంది. నిజంగా ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇది. తర్వాత సెకండ్ హాఫ్ లో సూర్య పాత్ర చుట్టూ నడిపిన సర్వైవల్ డ్రామా చాలా డిఫరెంట్ గా వుంటుంది. కొన్ని సన్నివేశాలు సీట్ ఎడ్జ్ థ్రిల్ ఎక్స్ పీరియన్స్ ఇస్తాయి. క్లైమాక్స్ మరో స్థాయిలో వుంటుంది. కథలని మలుపులు ఒకొక్కటి మంచి థ్రిల్ ని పంచుతాయి. అయితే ఇందులో కూడా కొన్ని లోటు పాట్లు వున్నాయి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఇంకాస్త పదునుగా వుంటే బావుండేది. ఇలాంటి థ్రిల్లర్స్ లో వేగం కోరుకుంటారు ప్రేక్షకులు. అది తప్పితే ఓవరాల్ గా 'ప్రసన్న వదనం' సినిమా ఆడియన్స్ ని సరికొత్తగా థ్రిల్ ని పంచుతుంది.  సూర్య పాత్రలో సుహాస్ జీవించాడు. ఇది రెగ్యులర్ పాత్ర కాదు. ఎమోషనల్ సీన్స్ లో తన నటన మరోస్థాయిలో వుంటుంది. ఇందులో సహజత్వంతో కూడిన యాక్షన్ సన్నివేశాల్లో కొత్త సుహాస్ కనిపిస్తాడు. తన కెరీర్ ఇది మరో గుర్తుండిపోయే పాత్ర. పాయల్ క్యూట్ గా ఆకట్టుకుంది. కథలో కూడా తనకి కీలక పాత్ర దక్కింది. రాశి సింగ్ కు పవర్ ఫుల్ రోల్ దొరికింది. ఆమె పాత్రని థియేటర్స్ లో చూసి ఆస్వాదించాల్సిందే. 

టెక్నీకల్ గా .. విజయ్ బుల్గానిన్ నేపధ్య సంగీతం కథని ఎలివేట్ చేసింది. కెమెరాపనితనం  నీట్ గా వుంది. ప్రొడక్షన్ డిజైన్ లావిష్ గా వుంది. నిర్మాతలు కథకు కావాల్సిన బడ్జెట్ సమకూర్చారు.సినిమా ఉన్నతంగా వుంది. కెమెరాపనితనం థ్రిల్ ని సరికొత్తగా ఎలివేట్ చేసింది. విజయ్ బుల్గానిన్ నేపధ్య సంగీతం బ్రిలియంట్ గా వుంది. కథలో ఇంటెన్స్ తీసుకొచ్చింది. ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ డిజైన్ రిచ్ గా వున్నాయి. నిర్మాతలు చేసిన ఖర్చు తెరపై కనిపించింది. కొత్త దర్శకుడు అర్జున్ కొత్త కథ రాసుకోవడమే కాదు.. దాన్ని కొత్తగా ప్రజెంట్ చేయడంలో విజయం సాధించాడు.  తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టాడు దర్శకుడు అర్జున్.

ఇంకా చదవండి: రత్నం మూవీ రివ్యూ: యాక్షన్‌ హంగామా!

# PrasannaVadanam     # Suhas     # RashiSingh     # TeluguCinema    

trending