'ఓం భీమ్‌ బుష్‌’ సినిమా  రివ్యూ : కాసేపు  నవ్వుకోవచ్చు!

'ఓం భీమ్‌ బుష్‌’ సినిమా రివ్యూ : కాసేపు నవ్వుకోవచ్చు!

1 month ago | 7 Views

శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన 'ఓం భీమ్‌ బుష్‌’ చిత్రం కామెడీ ట్రాక్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీవిష్ణుకి తోడుగా కామెడీ గ్యాంగ్‌  ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ తోడు కావడం... ప్రచార చిత్రాలూ ఆసక్తిని రేకెత్తించచడంతో సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. లెగసీ యూనివర్సిటీలో పీహెచ్‌డీ విద్యార్థులు బ్యాంగ్‌ బ్రదర్స్‌ క్రిష్‌ (శ్రీవిష్ణు), వినయ్‌ గుమ్మడి (ప్రియదర్శి), మ్యాడీ రేలంగి (రాహుల్‌ రామకృష్ణ). వీళ్లు చేసే పనులు భరించలేక తక్కువ సమయంలోనే  ముగ్గురికీ డాక్టరేట్లు ఇచ్చి పంపించేస్తాడు కళాశాలలోని ప్రొఫెసర్‌. దాంతో భైరవపురం చేరుకుంటారు. యూనివర్సిటీ జీవితంలాగే ఆ ఊళ్లో కూడా జల్సాగా బతకాలని నిర్ణయించుకుని సైంటిస్టుల అవతారమెత్తుతారు. ఎ టు జెడ్‌ సర్వీసెస్‌ పేరుతో ఓ దుకాణం తెరిచి ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తామని ప్రచారం చేసుకుంటారు.

కానీ ఈ ముగ్గురూ నిజమైన సైంటిస్టులు కాదని, ఊరి జనాల్ని బురిడీ కొట్టిస్తున్నారనే విషయం బయట పడుతుంది.  దాంతో ఊరి సర్పంచ్‌  ఓ పరీక్ష పెడతాడు. సంపంగి మహల్‌లో ఉన్న నిధిని కనిపెట్టి తీసుకొస్తే నిజమైన సైంటిస్టులని నమ్ముతామని చెబుతాడు. దెయ్యం ఉన్న ఆ మహల్‌లోకి నిధి కోసం వెళ్లాక ఈ బ్యాంగ్‌ బ్రదర్స్‌కి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి?  ఇంతకీ ఆ మహల్‌లో ఉన్న సంపంగి దెయ్యం కథేమిటి? అసలు వాళ్లు నిధిని తీసుకొచ్చారా? తదితర విషయాలు తెరకెక్కించారు. నో లాజిక్‌ ఓన్లీ మేజిక్‌ అంటూ ఉపశీర్షికలో సూచించినట్టే లాజిక్‌తో సంబంధం లేకుండా కేవలం మేజిక్‌నే నమ్ముకుని తెరకెక్కించిన సినిమా  ఇది. 'జాతిరత్నాలు’ తరహాలో ముగ్గురు  స్నేహితుల క్రేజీ ప్రయాణానికి....  హారర్‌ కామెడీతో కూడిన ఓ  కాన్సెప్ట్‌ని జోడించి   కథని అల్లుకున్నాడు దర్శకుడు.  దెయ్యాలు, ఆత్మలు అంటేనే ఆ కథల్లో  లాజిక్స్‌ని వెదక్కూడదు.  దెయ్యం భయపెట్టిందా లేదా అనేది చూడాలంతే. లాజిక్స్‌  జోలికి వెళ్లకుండా పాత్రలతోపాటే  ప్రయాణం చేస్తే  మాత్రం  బ్యాంగ్‌ బ్రదర్స్‌  అక్కడక్కడా  కొన్ని నవ్వుల్ని పంచుతారు.

సంపంగి దెయ్యం కూడా కొద్దిమేర  భయపెట్టి థ్రిల్‌ చేస్తుంది. స్నేహితులైన బ్యాంగ్‌ బ్రదర్స్‌  కళాశాలలోకి చేరి ప్రొఫెసర్‌ని మాటలతో బురిడీ కొట్టించడం నుంచి కథ మొదలవుతుంది.  ఆ కథ  భైరవపురం చేరుకున్నాక, ఆ తర్వాత ఊళ్లో ఎ టు జెడ్‌ సర్వీసెస్‌ మొదలయ్యాక అసలు సిసలు హంగామాకి తెర లేస్తుంది. ముగ్గురూ చేసే క్రేజీ పనులు నవ్విస్తాయి. ద్వితీయార్ధంలో కథంతా కూడా సంపంగి మహల్‌లోనే సాగుతుంది. అక్కడ దెయ్యం రాహుల్‌ రామకృష్ణనీ, ప్రియదర్శినీ భయపెట్టే సన్నివేశాల్లో  పండిన  హారర్‌, కామెడీ సినిమాపై ప్రభావం చూపిస్తుంది.

ఇంకా చదవండి: నూతన దంపతుల ఒత్తిడి సమస్యలపై చిత్రం!

# Om Bheem Bush     # Sree Vishnu     # Priyadarshi     # Rahul Ramakrishna    

trending