'భీమా' టీజర్‌ కు అనూహ్య స్పందన!!

'భీమా' టీజర్‌ కు అనూహ్య స్పందన!!

4 months ago | 7 Views

టాలీవుడ్‌ హీరో  గోపీచంద్‌ ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం ’భీమా’. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమాకు కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వం వహిస్తుండగా.. ప్రియా భవానీ శంకర్‌, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మోషన్‌ పోస్టర్‌తో పాటు ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదల చేయగా.. అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది.  రీసెంట్‌గా ఈ సినిమా నుంచి మేకర్స్‌  భీమా టీజర్‌ను  విడుదల చేశారు.

ఈ  'భీమా' టీజర్‌ కు అనూహ్య రెస్పాన్స్ వస్తోందని మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్‌ పవర్‌ ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తుండగా.. శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్‌పై కేకే రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. 'సలార్‌’ ఫేమ్‌ రవి బస్రూర్‌ సంగీతం అందిస్తున్నాడు.

ఇంకా చదవండి: 'గుంటూరు కారం'లో మీనాక్షి లుక్‌ విడుదల

# Gopichand     # Priya Bhavani Shankar     # Malvika Sharma    

trending