ఆ హీరో తెగ ఇబ్బంది పెట్టేవాడు : శ్వేతబసు

ఆ హీరో తెగ ఇబ్బంది పెట్టేవాడు : శ్వేతబసు

1 month ago | 5 Views

మొదటి సినిమాతోనే  కుర్రకారును హృదయాల్లో ప్రత్యేక క్రేజ్‌ తెచ్చుకుంది. కొన్నేళ్లుగా ఆమె తెలుగు సినిమాకు దూరంగా ఉంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కెరీర్‌ గురించి మాట్లాడారు. ఒక తెలుగు సినిమా సెట్‌లో దారుణంగా అవమానించారని అన్నారు. ఆ సెట్‌లో ప్రతిఒక్కరూ శరీరాకృతి విషయంలో ఎంతగానె ఎగతాళి చేశారని చెప్పారు. ఆ మాటలు ఎంతగానో బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నటిగా నేను సంతృప్తిగానే ఉన్నా. నాకు నచ్చిన సినిమాలు చేశాను. ప్రస్తుతం టెలివిజన్‌ ఇండస్ట్రీలో రాణిస్తున్నాను. కెరీర్‌ పరంగా ఇబ్బందిపడిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఒక తెలుగు సినిమా సెట్‌లో చాలా ఇబ్బందిపడ్డా. హీరోతో పోలిస్తే నేను ఎత్తు తక్కువగా ఉన్నానని సెట్‌లో ఉన్న ప్రతిఒక్కరూ నన్ను ఎగతాళి చ్ఱేసవారు. హీరో ఆరడుగులు ఉంటే ఈవిడేమో 5 అడుగులు ఉందని కామెంట్‌ చేసేవారు. ఇక, హీరోతో వచ్చిన సమస్య మరో స్థాయిలో ఉండేది. అతను ప్రతి సన్నివేశాన్ని మార్చేస్తుండేవాడు. గందరగోళానికి గురి చేసేవాడు. రీటేక్స్‌ ఎక్కువగా తీసుకునేవాడు. నిజం చెప్పాలంటే నాక్కూడా తెలుగు సరిగ్గా రాదు. కానీ, నేను ఏదో ఒకరకంగా డైలాగ్స్‌ నేర్చుకొని షూట్‌లో నడిపించేదాన్ని.

Actress Shweta Basu Prasad lashes out at the media in open letter

అతను మాత్రం అలా కాదు. మాతృభాష తెలుగే అయినప్పటికీ అతనికి భాషపై పట్టు లేదు కానీ, నన్ను మాత్రం నా కంట్రోల్‌లో లేని నా ఎత్తు గురించి కామెంట్‌ చేసేవాడు. ఎత్తు అనేది వారసత్వంగా వస్తుంది కదా. దానికి నేనేం చేసేది. నాకు తెలిసి నేను అంత బాధపడిన సెట్‌ ఏదైనా ఉందంటే అదే’’ అని శ్వేతా బసు అన్నారు. 11 ఏళ్ల వయసులోనే నటిగా కెరీర్‌ ప్రారంభించింది శ్వేతా బసు ప్రసాద్‌.  ‘మక్ది’ అనే సినిమా ఆమె నటించిన తొలి చిత్రం. 2008లో తెరకెక్కిన ‘కొత్తబంగారు లోకం’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా విజయం తర్వాత ‘రైడ్‌’, ‘కాస్కో’, ‘కళవర్‌ కింగ్‌’, ‘ప్రియుడు’, ‘జీనియస్‌’ వంటి చిత్రాల్లో యాక్ట్‌ చేశారు. 2018లో విడుదలైన ‘విజేత’ తర్వాత ఆమె తెలుగు సినిమాల్లో యాక్ట్‌ చేయలేదు. ప్రస్తుతం వెబ్‌సిరీస్‌లు, సీరియళ్లు చేస్తూ బిజీగా ఉంది. అప్పుడప్పుడు దర్శకత్వ శాఖలోనూ పని చేస్తుంటుంది.

ఇంకా చదవండి: మరో ఘనతను దక్కించుకున్న అలియాభట్‌

"Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!"

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# శ్వేతబసు     # తెలుగు    

trending

View More