
ఆయన లేకపోతే 'తండేల్' సినిమానే లేదు!
1 month ago | 5 Views
అక్కినేని నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘తండేల్’. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను అల్లు అరవింద్ నిర్మించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. జాలరి పాత్రలో నాగ చైతన్య కనిపించగా, అతన్ని ప్రేమించే పాత్రలో సాయి పల్లవి నటించారు. గాఢంగా ప్రేమించుకున్న జంట అనూహ్యం ఎడబాటుకు గురి అవుతుంది. ప్రేమికులు తిరిగి ఎలా కలుసుకున్నారనేది ‘తండేల్’ కథ.
ఈ కథలో దేశభక్తిని కూడా దర్శకుడు జోడించారు. సినిమా అద్భుతంగా ఉందని ప్రేక్షకులు కితాబిస్తున్నారు. నాగ చైతన్య, సాయి పల్లవి పోటీపడి నటించారు. మొదటి భాగంలో సాయి పల్లవి ఎమోషన్స్ బాగా పండాయి. అదే విధంగా సాయి పల్లవిని డామినేట్ చేస్తూ నాగ చైతన్య నటించారు. సెంకడాఫ్‌లో సినిమా కాస్తా స్లో ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే చివర 20 నిమిషాల సినిమాను తన దర్వకత్వంతో కట్టిపడేశాడు చందు మొండేటి. ఇదంతా ఒక ఎత్తు అయితే, దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం మరో ఎత్తు.
ఈ తండేల్ మూవీకి దేవిశ్రీ సాంగ్స్ బ్యాక్ బోన్‌గా నిలిచారు. ఈ మధ్య కాలంలో దేవిశ్రీ ఇచ్చిన బెస్ట్ సినిమా ఇదే. 'పుష్ప-2'ను మించిన మ్యూజిక్ ఈ 'తండేల్'కు దేవీ శ్రీ అందించాడు. ఈ సినిమా విడుదలకు ముందు వరకు దేవి శ్రీ ప్రసాద్‌పై ఎన్నో విమర్శలు వినిపించాయి. ఈ సినిమాకు ఎందుకు దేవి శ్రీ ప్రసాద్‌ను తీసుకున్నారనే కామెంట్స్ తెర మీదకు వచ్చాయి. అయితే ప్రేమకథలకు దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చే మ్యూజిక్ మరో లేవల్లో ఉంటుందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. దీంతో దేవిశ్రీ అందించిన మ్యూజిక్ వేరే లెవల్‌లో ఉందని ఆయన లేకుంటే సినిమానే లేదని పలువురు పేర్కొంటున్నారు.
ఇంకా చదవండి: పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణని సత్కరించిన టాలీవుడ్ ప్రముఖులు