
రూ.100 కోట్ల బడ్జెట్‌లోకి వెళ్లిన 'తండేల్'
1 month ago | 5 Views
యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం తండేల్. ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 07 ఈ మూవీ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. విడుదలైన రెండు రోజుల్లోనే దాదాపు రూ.41కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు నమోదు చేసిందీ మూవీ. అయితే తాజాగా 8 రోజుల్లోనే ఈ మూవీ రూ. 95.20 కోట్ల వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. ఈ వీకెండ్ లోనే రూ. 100 కోట్లు కొల్లగొడుతుందని చిత్ర యూనిట్ అంచనా వేస్తోంది. దీంతో చైతూ రూ. 100కోట్ల క్లబ్ లోకి చేరనున్నట్లు సమాచారం అందుతోంది.
ఇక ఈ సినిమాను గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఇక ఈ మూవీలో డీ గ్లామర్ లుక్ లో చైతూ, సాయి పల్లవి కనిపించారు. చాలా సన్నివేశాల్ని ఎండలో, వానలో, సముద్రంలో 30 రోజులపాటు రాత్రింబవళ్లు కష్టపడి ఈ చిత్రం షూటింగ్ చేశారట. అందుకే సినిమాలో సముద్రం సన్నివేశాలు చాలా అద్భుతంగా వచ్చాయని ఇండస్ట్రీ వర్గాలతోపాటు సినిమా చూసిన ప్రేక్షకులు చెప్తున్నారు. నాగచైతన్య కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు సమాచారం. దాదాపు రూ.90 కోట్లతో ఈ సినిమా రూపొందించినట్లు టాక్. అయితే ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో సినిమా దూసుకెళ్తోంది. ఈ వారం వీకెంట్ పూర్తయ్యేనాటికి తండేల్ మూవీ రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరుకుంటుందని సమాచారం.
ఇంకా చదవండి: వరుస హిట్స్ తో దూసుకుపోతున్న సాయిపల్లవి
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# తండేల్ # నాగ చైతన్య # సాయిపల్లవి